సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న నాని వి ట్రైలర్

0
52
nani

సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న నాని వి ట్రైలర్

నాని విభిన్న పాత్ర పోషిస్తున్న చిత్రం ” వి  “.  మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా వి చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. వి చిత్ర ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందినట్లు తెలియడంతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఇప్పటి వరకు రూపొందించిన చిత్రాలు అన్ని కూడా లైటర్ వేలో ఉంటాయి కానీ ఈ వి చిత్రం మాత్రం అందుకు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ గా వి చిత్రం తెరకెక్కింది. నాని నెగెటివ్ రోల్ పోషించగా సుధర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.

హీరోయిన్ లుగా నివేదా థామస్ , అదితి రావు హైదరీ లు నటించారు. ఇంతకుముందు నివేదా థామస్ – నాని ల కాంబినేషన్ లో రెండు చిత్రాలు రాగా ఆ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. జెంటిల్ మెన్ , నిన్ను కోరి చిత్రాల్లో జంటగా నటించారు నాని – నివేదా థామస్. అయితే ఆ చిత్రాల్లో ఈ ఇద్దరు కూడా టిపికల్ రోల్స్ పోషించారు. కట్ చేస్తే ఈ చిత్రంలో కూడా విభిన్న పంథాలో నటించారట. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ జోష్ చూస్తే తప్పకుండా వి మంచి విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది.

నాని కి ‘వి ‘చిత్రం  25 వ సినిమా కావడం విశేషం. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం నాని హీరోగా నటించిన మొదటి చిత్రం అష్టా చమ్మా విడుదల అయ్యింది సెప్టెంబర్ 5 న దాంతో వి సినిమాని కూడా సెప్టెంబర్ 5 న అమెజాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని థియేటర్ లోనే విడుదల చేయాలని అనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. అయితే 5 నెలలుగా కరోనా అదుపులోకి రావడం లేదు కాబట్టి అమెజాన్ లో విడుదల చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు దిల్ రాజు. దాంతో మరో పది రోజుల్లో అమెజాన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నాని వి.

మునుపటి వ్యాసంఅర్జున్ రెడ్డి సంచలనానికి 3 ఏళ్ళు
తదుపరి ఆర్టికల్తమన్నా ఇంట కరోనా కలకలం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి