ప్రభాస్ రాముడిగా నటిస్తే మరి రావణుడు ఎవరు ?

0
51
saif ali khan
ప్రభాస్ రాముడిగా నటిస్తే మరి రావణుడు ఎవరు ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో తన 22 వ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆది పురుష్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అయితే ప్రభాస్ రాముడిగా నటిస్తే మరి రావణాసురుడు ఎవరు ? అన్న ఆసక్తి మొదలైంది. ప్రభాస్ కు తగ్గ రావణుడు అంటే బాలీవుడ్ లో చాలామందే ఉన్నారు కానీ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట దర్శకుడు ఓం రావుత్.

ఇటీవల సైఫ్ అలీఖాన్ తానాజీ అనే బాలీవుడ్ చిత్రంలో విలన్ గా నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక మరో విశేషం ఏంటంటే ఆ సినిమాకు ఓం రావుత్ దర్శకత్వం వహించాడు. మహారాష్ట్ర వీర శివాజీ దగ్గర సేనాధిపతిగా పనిచేసిన తానాజీ జీవిత కథతో ఈ తానాజీ తెరకెక్కింది. తానాజీ గా అజయ్ దేవ్ గన్ నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతోనే ప్రభాస్ ఆది పురుష్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓం రావుత్ దర్శకత్వ ప్రతిభ గురించి చాలా నమ్మకంగా ఉన్నాడు ప్రభాస్ అందుకే ఈ సినిమాకు అంగీకరించాడు.

ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తే అందుకు తగ్గ ఇమేజ్ ఉన్న వ్యక్తి రావణాసురుడుగా నటించాలి లేదంటే సినిమా తేలిపోయే అవకాశం ఉంటుంది అందుకే సైఫ్ అలీఖాన్ తో పాటుగా రానా ని కూడా ఒక ఆప్షన్  గా పెట్టుకున్నారట. అయితే దర్శకుడు మాత్రం సైఫ్ అలీఖాన్ వైపే మొగ్గు చూపుతున్నాడట. ఇక పట్టాలెక్కే సమయానికి పరిస్థితి మారినా మారొచ్చు. ఇక ఇదే సమయంలో ప్రభాస్ కు తగ్గ హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడట దర్శకుడు. ఒకవేళ రానా ని రావణాసురుడుగా నటిస్తే మరోసారి బాహుబలి కాంబినేషన్ ని ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే రానా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు రావణాసురుడిగా. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి