నేను ఏ తప్పు చేయలేదంటున్న రియా చక్రవర్తి

0
42
riya

నేను ఏ తప్పు చేయలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది హీరోయిన్ రియా చక్రవర్తి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో రియా చక్రవర్తి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాంతో గత కొద్ది రోజులుగా రియా పై పలు కథనాలు వెలువడ్డాయి. తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఖండించాలని ఓ వీడియో రూపొందించింది. ఆ వీడియో లో కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు ఏ పాపం కూడా తెలియదని అంటోంది రియా చక్రవర్తి. దేవుడు ఉన్నాడు తప్పకుండా సత్యమే గెలుస్తుందని అంటోంది.

అయితే రియా చక్రవర్తి పై అనుమానాలు కలగడానికి కారణం సుశాంత్ అకౌంట్ నుండి 15 కోట్లు మాయం కావడం. అలాగే సుశాంత్ ఆత్మహత్య చేసుకునే వారం రోజుల ముందుగానే అతడికి బ్రేకప్ చెప్పడం. సుశాంత్ కి తెలివి లేదని అతడ్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇత్యాది సంఘటనలకు మూలం రియా కావడంతో ఆమెపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీహార్ పోలీసులు సైతం. అందుకే రియా పై కేసు నమోదు చేశారు. దాంతో రియా ఈ వీడియో విడుదల చేయడమే కాకుండా సుప్రీం కోర్టు కైనా సరే వెళ్తానని అంటోంది తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి. సమగ్రంగా విచారణ జరిగితే కానీ తెలీదు అసలు నిజాలు ఏంటి ? అన్నది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి