కరోనా దెబ్బకు పారిపోతున్న హైదరాబాద్ ప్రజలు

0
23
coronavirus,3d render
కరోనా దెబ్బకు హైదరాబాద్ ప్రజలు పారిపోతున్నారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టిన లక్షలాది మంది బ్రతుకు జీవుడా అనుకుంటూ తమ తమ స్వగ్రామలకు పయనమయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కరోనా విలయతాండవం చేస్తుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పల్లెలకు బయలుదేరారు. హైదరాబాద్ లో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ పెడతారనే ప్రచారంతో ఖంగుతిన్న ప్రజలు తట్టా బుట్టా సర్దుకుని పల్లెలకు బయలుదేరారు. పేద, ధనిక అనే తేడా లేకుండా బతికుంటే చాలు బలుసాకు అయినా తినొచ్చు కానీ పట్నంలో మాత్రం బతకలేం అంటూ పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు పెద్ద మొత్తంలో నమోదు అవుతున్నాయి. ఆసుపత్రులలో బెడ్స్ ఖాళీ లేవు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకొండని వైద్యులు చెబుతుండటంతో దిక్కులు పిక్కటిల్లేలా ఏడుసున్నారు. కరోనా సోకిన వాళ్ళతో చిన్న చిన్న కిరాయి ఇండ్లల్లో ఉండలేక తమ రాతలు ఇలా తగలడ్డాయి అనుకుంటూ కుమిలిపోతున్నారు హైదరాబాద్ లోని వలస జీవులు. గ్రామాల్లో సరైన పనులు లేక పట్టణాలకు వలస వెళ్లిన వాళ్ళు ఎక్కువ దాంతో కరోనా సమయంలో పనులు లేక , బ్రతుకు తామో , లేదో తెలియక సతమతం అవుతున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున జనాలు హైదరాబాద్ నుండి విడిచి వెళ్తుండటంతో హైదరాబాద్ బోసి పోతోంది.  

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి