హైదరాబాద్ మేయర్ కు కరోనా

0
47

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా సోకింది. మేయర్ బొంతు రామ్మోహన్ కు ఇటీవల కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది దాంతో మేయర్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్ చేశారు అయితే వాళ్లకు నెగెటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బొంతు రామ్మోహన్ కు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి సింప్టమ్స్ లేకపోవడంతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడు. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు మేయర్ బొంతు రామ్మోహన్.

ఇటీవల పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. దాంతో పలువురు రాజకీయ నాయకులు, ఇతర అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మేయర్ కు ఒకసారి కరోనా టెస్ట్ చేశారు అయితే అప్పట్లో మేయర్ బొంతు రామ్మోహన్ కు నెగెటివ్ వచ్చింది. ఆ సమయంలో మేయర్ డ్రైవర్ కు కరోనా వచ్చింది దాంతో మేయర్ కు టెస్ట్ చేశారు. బొంతు రామ్మోహన్ ఇటీవల కేటీఆర్ పై చిత్రీకరించిన పాటలో నటించాడు. అధికార టీఆర్ఎస్ పార్టీలో పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

మునుపటి వ్యాసంటాటూ లు ఫ్యాషన్ గురించి శృతి హాసన్
తదుపరి ఆర్టికల్కరోనా నుండి కోలుకున్న హీరోయిన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి