హైదరాబాద్ లో పరువు హత్య

0
74
hemanth,avanthi love marriage

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. మిర్యాలగూడలో ప్రణయ్ హత్యని ఇంకా మరిచిపోకముందే హైదరాబాద్ మహానగరంలో మరో పరువు హత్య అత్యంత కిరాతకంగా జరిగింది. కన్నకూతురు తమకు నచ్చని వాడిని , ఇతర కులం వాడిని , అంతగా ఆస్థి లేని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో అల్లుడిని కిరాతకంగా చంపించాడు ఓ తండ్రి. సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగింది.

చందానగర్ లో నివాసం ఉండే హేమంత్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా హేమంత్ ని ప్రేమించడంతో పెద్దలను ఎదురించి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసుల సమక్షంలో యువతి పేరు మీద ఉన్న ఆస్తులను తండ్రికి రాసి ఇచ్చింది. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగు నెలలు అవుతోంది.

ఇక పెళ్లి చేసుకున్న యువ జంట హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో గల టి ఎన్జీవో కాలనిలో నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం గచ్చిబౌలి లో హేమంత్ తో పాటు అతడి భార్య ని కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అయితే యువతి తప్పించుకోవడంతో హేమంత్ ని కిడ్నాప్ చేసిన దుండగులు సంగారెడ్డి లో హత్య చేసి ముళ్ల పొదల్లో పడేసారు. తన భర్తని కిడ్నాప్ చేయడంతో ఆ యువతి 100 కి డయల్ చేసినప్పటికీ సకాలంలో పోలీసులు స్పందించకపోవడంతో ఈ హత్య జరిగిందని పోలీసులపై ఆరోపిస్తోంది సదరు యువతి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారించగా సంగారెడ్డి లో శవమైన హేమంత్ మృతదేహం లభించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు డాక్టర్లు. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న హైదరాబాద్ లో ఇలాంటి సంఘటన జరగడంతో మళ్ళీ కలకలం చెలరేగింది. 

మునుపటి వ్యాసంహీరోయిన్ రష్మిక మందన్న హీరో విజయ్ దేవరకొండ ఇంట్లో సందడి చేసింది
తదుపరి ఆర్టికల్ఏడేళ్ల తర్వాత డైరెక్టర్ గా ఛాన్స్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి