మహేష్ కోసం భారీ సెట్ రెడీ

0
39
mahesh babu

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసారట . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మోషన్ పోస్టర్ ని విడుదల చేయగా దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక కరోనా వల్ల షూటింగ్ లన్ని ఆగిపోవడంతో సర్కారు వారి పాట ఎప్పుడు మొదలౌతుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. అయితే మహేష్ అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త ఎందుకంటే త్వరలోనే సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ మొదలు కానుంది.


రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున సెంట్రల్ బ్యాంక్ కి సంబందించిన సెట్ వేసారట. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఈ సెట్ కు రూపకల్పన చేసాడు. ఈ భారీ సెట్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట దర్శకులు పరశురామ్. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. పలువురు ప్రముఖులు బ్యాంక్ ల వద్ద వందల కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం కోసం ఫారిన్ పారిపోతుంటారు. మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు కాగా ఇదే కథాంశంతో సర్కారు వారి పాట చిత్రం రూపొందుతోంది.

బ్యాంక్ లను మోసం చేస్తూ విదేశాలకు వెళ్లి జల్సా చేస్తున్న వాళ్ళ అంతు చూసేవాడిగా మహేష్ బాబు నటించనున్నాడు. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది. లవర్ బోయ్ గా కూడా మహేష్ బాబు కనిపించనున్నాడు ఈ చిత్రంలో. మొత్తానికి ఈ సినిమా మహేష్ అభిమానులకు కనువిందే అని అంటున్నారు. ఈ సినిమా కోసమే మహేష్ న్యూ లుక్ ట్రై చేసాడు దానికి మంచి స్పందనే వస్తోంది. అలాగే మహేష్ మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు. 

మునుపటి వ్యాసంకాబోయే భర్తతో జిమ్ చేస్తున్న నిహారిక
తదుపరి ఆర్టికల్శ్రీ ముఖి ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి