సోనూ సూద్ కు ఇప్పటివరకు ఎన్ని మెసేజ్ లు వచ్చాయంటే

0
71
actor sonu
కరోనా కష్టకాలంలో పేద , మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచి హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సోనూ సూద్. విలన్ ఇమేజ్ ఉన్న ఈ నటుడు ఒక్కసారిగా కరోనా సమయంల హీరోగా అవతరించాడు. వందలాది మంది వలస కూలీలను తమతమ స్వగ్రామాలకు తన స్వంత ఖర్చులతో పంపించాడు. అంతేకాదు ముంబై లోని ఖరీదైన తన హోటల్ ని వలస కార్మికులు ఉండటానికి ఇవ్వడమే కాకుండా భోజన వసతి కూడా కల్పించాడు. అలాగే ఆపదలో ఉన్నామని వేడుకున్న వాళ్లకు వ్యక్తిగతంగా కూడా సహాయం అందించాడు.

దాంతో సోనూ సూద్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ఆపదలో ఉన్నవాళ్లకు సహాయం అందిస్తున్నాడని తెలియడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సహాయం కోసం సోనూ సూద్ కు విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంతో సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్న వాళ్లకు నాదో విన్నపం . ఎవరి విజ్ఞప్తి నైనా నేను చూడకపోతే స్పందించకపోతే నన్ను క్షమించండి ఎందుకంటే నాకు రకరకాల ద్వారా పెద్ద ఎత్తున సహాయం కోసం అభ్యర్థనలు వస్తున్నాయని అన్నింటికీ ఒకేసారి స్పందించలేనని పేర్కొంటూ నా శక్తి మేరకు సహాయం చేస్తూనే ఉన్నానని తెలిపాడు.

ఇక సోనూ సూద్ కు ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్ ల లిస్ట్ తాజాగా విడుదల చేసాడు. ఫేస్ బుక్ ద్వారా  19 వేల మెసేజ్ లు , ట్విట్టర్ ద్వారా 6741 మెసేజ్ లు , ఈ మెయిల్ ద్వారా 1137 , ఇన్ స్టా గ్రామ్ ద్వారా 4812 మెసేజ్ లు వచ్చాయని పేర్కొన్నాడు సోనూ సూద్. అంటే ఇంతమందికి సహాయం చేయడం సోనూ సూద్ వల్ల కాదు అయినప్పటికీ తనకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నాడు. అయితే సోనూ సూద్ సహాయం అందిస్తున్నాడు అని మీడియాలో ప్రచారం కూడా ఎక్కువ కావడం వల్ల కూడా ఇలాంటి విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక ఇందులో కొన్ని ఆకతాయిలు సరదా కోసం కూడా చేస్తున్నారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి