రెండో పెళ్ళికి సిద్దమైన హాట్ భామ

0
35
gutha jwala engaged with vishnu vishal

టాలీవుడ్ మూవీ న్యూస్, చెన్నై- బ్యాడ్మింటన్ ఆడుతూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ గుత్తా జ్వాల రెండో పెళ్ళికి రంగం సిద్ధం చేసుకుంది. తాజాగా ఈరోజు తన ఎంగేజ్ మెంట్ జరిగింది. తమిళ హీరో విష్ణు విశాల్ తో గత రెండేళ్లుగా సహజీవనం చేస్తోంది గుత్తా జ్వాల. ఈరోజు ( సెప్టెంబర్ 7) గుత్తా జ్వాల పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గుత్తా జ్వాల కు వివాహ నిశ్చితార్థపు ఉంగరాన్ని తొడిగాడు విష్ణు విశాల్. ఇక మా ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ అయ్యిందని , కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అంటూ ట్వీట్ చేసాడు హీరో విష్ణు విశాల్.

jwala vishnu

గుత్తా జ్వాల కు మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తో 2005 లోనే వివాహం అయ్యింది. గుత్తా జ్వాల – చేతన్ ఆనంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల కాపురం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపడంతో 2011 లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఈ భామ. అయితే నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించి అందరికి షాక్ ఇచ్చింది గుత్తా జ్వాల. ఆ ఐటెం సాంగ్ లో అందాలను ఆరబోసింది కానీ డ్యాన్స్ సరిగ్గా చేయలేకపోయిందనే విమర్శలు ఎదుర్కొంది పాపం.

engagement ring

ఇక విష్ణు విశాల్ విషయానికి వస్తే ……. 2010 లో రజనీ నటరాజన్ అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఒక కొడుకు కూడా. అయితే కొన్నాళ్ల కాపురం తర్వాత వాళ్లకు కూడా గొడవలు జరిగాయి దాంతో 2018 లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకోకముందే గుత్తా జ్వాల పరిచయం కావడం , ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇక ఈరోజు వివాహ నిశ్చితార్థం జరిగింది త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారట. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి