మగాళ్లు ఆడవాళ్ళ కాళ్ళు పిసకాలాట హాట్ భామ సలహా

0
49
bipasa basu

మగవాళ్ళు ఆడవాళ్ళ కాళ్ళు పిసకాలని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ బిపాసా బసు. నేను మీకు చెప్పడమే కాదు ఆచరణలో అలాంటి అనుభూతి పొందుతున్నాను అందుకే మగాళ్లకు ఉచిత సలహా ఇస్తున్నానని అంటోంది బిపాసా. నా భర్త కరణ్ సింగ్ గ్రోవర్ ప్రతీ రోజూ ఇదే పని చేస్తున్నాడని మరింత షాక్ ఇచ్చింది. ప్రతీ రోజు రాత్రి అరగంట పాటు నా భర్త కరణ్ నా కాళ్ళు పడతాడని , కాళ్లకు మర్దన చేస్తాడని , అలా చేయడం వల్ల అతడిపై నాకు ఎనలేని గౌరవం , ప్రేమ ఏర్పడిందని దాని వల్ల పడక సుఖంలో మరింతగా ప్రేమ కురిపించడానికి అవకాశం ఏర్పడిందని అతడికి మర్చిపోలేని పడక సుఖం అందిస్తానని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పింది బిపాసా బసు.

మగాళ్లు భార్య కాళ్ళు పట్టడం వల్ల ప్రతీ భార్య మనసు పులకించి పోతుందని , ఎందుకంటే రోజంతా పడిన కష్టాన్ని భర్త కాళ్ళు నొక్కడం వల్ల మర్చిపోతామని దాంతో భర్త పట్ల మరింత ప్రేమగా ఉండాలని ఆ భార్య కోరుకుంటుందని దాంతో ఇద్దరి మధ్య శృంగార జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని అంటోంది. అంతేకాదు ప్రతీ మగాడు కూడా తన భార్య కాళ్ళు పట్టాలని , ప్రతీ రోజు అరగంట పాటు ఇలా చేయడం వల్ల మంచి అనుబంధం ఏర్పడుతుందని అందుకే ప్రతీ మగాడికి నేను ఇస్తున్న సలహా ఇదే అని కుండబద్దలు కొట్టింది బిపాసా బసు.

నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది బిపాసా. 2016 లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఇక బిపాసా కాళ్ళు నొక్కి మంచి ఉపశమనం కలిగించేలా చేస్తున్నాడట కరణ్. అంతేకాదు భర్తతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం మరింత ఈజీ అవుతుందని , ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటోంది బిపాసా . మగాళ్లకు ఉచిత సలహా బాగానే ఇచ్చింది కానీ బిపాసా సలహాని పాటించే వాళ్ళు ఎంతమంది అన్నది చూడాలి. 

మునుపటి వ్యాసం50 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి రెడీ అవుతున్న భామ
తదుపరి ఆర్టికల్ఆచార్య మోషన్ పోస్టర్ వచ్చేసింది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి