హోం క్వారంటైన్ లోకి మంత్రి ఎర్రబెల్లి

0
53

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హోం క్వారంటైన్ లోకి వెళ్ళాడు. తన పిఏ, గన్ మెన్లు ఇద్దరు, కానిస్టేబుల్ , డ్రైవర్ ఇలా మొత్తం ఆరుగురికి కరోనా టెస్ట్ చేయగా అందరుకి కరోనా పాజిటివ్ అని తేలడంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మంత్రితో వాళ్లంతా సన్నిహితంగా మెలిగారు కాబట్టి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. అయితే అధికారులతో అలాగే ఇతర పనులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా వీడియో కాల్ లో అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేస్తానని స్పష్టం చేసారు ఎర్రబెల్లి దయాకరరావు.

వరంగల్ జిల్లాలో పేరు మోసిన నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కు అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. కట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి కారు గుర్తుపై గెలిచాడు. మంత్రి పదవి వరించింది. తన చిరకాల వాంఛ మంత్రి పదవి చేపట్టడం. దాంతో కేసీఆర్ కు వీరాభిమానిగా మారిపోయాడు ఎర్రబెల్లి. బాగానే కష్టపడి పనిచేస్తున్నాడు. ఈలోపు కరోనా విలయతాండవం చేస్తుండటంతో తన సహచరులకు కరోనా సోకడంతో హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి