హిట్ చిత్రానికి సీక్వెల్ !

0
37
hit movie sequel comming soon

హిట్ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నామని ప్రకటించాడు హీరో నాని. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ దర్శకత్వంలో నాని నిర్మించిన చిత్రం హిట్. ఫిబ్రవరి 28 విడుదలైన హిట్ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్లు వస్తున్నాయి దాంతో లాభాలు వస్తుండటంతో హిట్ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు నాని. ఈరోజు సీక్వెల్ ప్రకటించాడు కూడా. దర్యాప్తు నేపథ్యంలో తెరకెక్కిన హిట్ కు సీక్వెల్ గా హిట్ కేస్ 2 అనే టైటిల్ కూడా అనౌన్స్ చేసాడు నాని.

విశ్వక్ సేన్ ఇంతకుముందు వెళిపోమాకే చిత్రంలో నటించాడు అది అంతగా ఆడలేదు కట్ చేస్తే నగరానికి ఏమైంది అన్న చిత్రంలో నటించాడు అది కూడా అంతగా ఆడలేదు దాంతో తానే హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేసాడు అదే ఫలక్ నుమా దాస్. సినిమా విశ్వక్ కు కమర్షియల్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. కట్ చేస్తే హిట్ తో సూపర్ హిట్ కొట్టాడు దాంతో చాలా సంబరపడిపోతున్నాడు విశ్వక్ సేన్

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి