హిందీలో రీమేక్ అవుతున్న హిట్ చిత్రం

0
48

విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి లేకుంటే ఇంకా పెద్ద విజయాన్ని సాధించేది. అయినప్పటికీ మంచి విజయాన్ని అందుకుంది హిట్ చిత్రం. కట్ చేస్తే ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. విశ్వక్ సేన్ పోషించిన పాత్రని హిందీలో రాజ్ కుమార్ రావు పోషించనున్నాడు. తెలుగులో మంచి హిట్ అయిన చిత్రాన్ని హిందీలో అది కూడా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తో పని చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు హీరో రాజ్ కుమార్ రావు.

ఇక హిదీలో కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నాడు. హిట్ చిత్రంతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు శైలేష్ కొలను. అలాగే ఇదే హిట్ చిత్రంతో బాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అవుతుండటం విశేషం. అయితే ఇప్పుడు కరోనా ఇంకా తగ్గలేదు కాబట్టి ఇప్పట్లో అయితే షూటింగ్ ఉండదు కాకపోతే పక్కా స్క్రిప్ట్ వర్క్ అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులను చేయనున్నారు. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేయనున్నారట. అంటే 2021 లో సెట్స్ మీదకు వెళ్తుందన్న మాట.  

మునుపటి వ్యాసంవైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్రెండీ లుక్
తదుపరి ఆర్టికల్పవన్ కళ్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చాడా అంటున్న ఫ్యాన్స్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి