పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన హీరోయిన్

0
69
shalini vadnikatti

 

కృష్ణ అండ్ హీజ్ లీలా చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన షాలిని వడ్ని కట్టి సడెన్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. ఇటీవల డిజిటిల్ లో స్ట్రీమింగ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది కృష్ణ అండ్ హీజ్ లీలా చిత్రం. యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రంతో షాలిని వడ్ని కట్టి కి మంచి పేరొచ్చింది. క్షణం ఫేమ్  రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించి కుర్రాళ్ళని ఆకట్టుకున్న షాలిని సడెన్ గా పెళ్లి చేసుకోవడమే కాకుండా తన పెళ్లి అయినట్లుగా భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. దాంతో షాక్ అవ్వడం మిగతా వాళ్ళ వంతయ్యింది.

కన్నడ భామ అయిన షాలిని వడ్నికట్టి కన్నడ భాషలో అలాగే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. 2015 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది పాపం. సరిగ్గా ఇప్పుడే మంచి పేరు వస్తున్న క్రమంలో ప్రేమికుడిని పెళ్ళాడి షాక్ ఇచ్చింది. ఇక షాలిని పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా ……… ఓ యువ దర్శకుడు అన్నమాట. మనోజ్ బీద అనే తమిళ దర్శకుడ్ని ప్రేమించింది షాలిని. మనోజ్ బీద దర్శకుడిగా ఓ సినిమా చేసాడు కానీ అది విజయం సాధించలేదు.

షాలిని వడ్ని కట్టి పెళ్లి అయితే చేసుకుంది కానీ సినిమాల్లో నటించను అని మాత్రం స్టేట్ మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ పెళ్లి అయ్యాక షాలినిని హీరోయిన్ గా ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు అన్నది చూడాలి. హీరోలకు పెళ్లి అయితే తప్పులేదు కానీ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే మాత్రం అంతగా ఛాన్స్ లు ఇవ్వరు దర్శక నిర్మాతలు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి