హీరోయిన్ రష్మిక మందన్న హీరో విజయ్ దేవరకొండ ఇంట్లో సందడి చేసింది

0
40
vijaydevarakonda mothers birthday

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్హీరోయిన్ రష్మిక మందన్న హీరో విజయ్ దేవరకొండ ఇంట్లో సందడి చేసింది. నిన్న విజయ్ దేవరకొండ అమ్మ మాధవి పుట్టినరోజు కావడంతో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు అందజేయడానికి విజయ్ దేవరకొండ ఇంటికి వచ్చింది. ఇక ఈ పుట్టినరోజు వేడుకలో సందడి అంతా రష్మిక మందన్నదే అయ్యిందట. ఇక ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా రష్మిక నిలిచింది. ఈ ఏడాది లోనే విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో కొత్త ఇల్లు కట్టుకున్న విషయం తెలిసిందే. కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత విజయ్ దేవరకొండ తల్లి మొదటి పుట్టినరోజు ఇది అందుకే సన్నిహితుల సమక్షంలో తల్లి జన్మదిన వేడుకలు నిర్వహించాడు ఈ క్రేజీ హీరో.

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హిట్ పెయిర్ అన్న విషయం తెలిసిందే . మొదట ఈ జంట గీత గోవిందం చిత్రంలో నటించారు ఆ సినిమా పెద్ద విజయం సాధించింది దాంతో డియర్ కామ్రేడ్ చిత్రంలో మళ్ళీ జంటగా నటించారు అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు కానీ విజయ్ దేవరకొండ కు అలాగే రష్మిక కు బాగా నచ్చిన సినిమా. అంతేకాదు మంచి కథాంశం ఉన్న సినిమా కూడా కాకపోతే నిడివి ఎక్కువ కావడం వల్లో లేక రిలీజ్ రాంగ్ టైమో కానీ అంతగా విజయం సాధించలేదు. అయితే యూట్యూబ్ లో మాత్రం దడదడలాడిస్తోంది.

ఇక విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఆ సినిమాల తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. తాజాగా విజయ్ దేవరకొండ ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా గా రూపొందుతోంది. ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే …… స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ సరసన పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో నటించనుంది. మళ్ళీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు అభిమానులు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మునుపటి వ్యాసంఆసుపత్రికి వెళ్లి బాలుని పరామర్శించిన  కమల్ హాసన్
తదుపరి ఆర్టికల్హైదరాబాద్ లో పరువు హత్య
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి