హీరోయిన్ గా మారుతున్న వల్లంకి పిట్ట

0
59
kavya

వల్లంకి పిట్ట …. వల్లంకి పిట్ట అనే పాటలో నటించిన బాలనటి కావ్య ఇప్పుడు హీరోయిన్ గా టర్న్ అవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన చిత్రం గంగోత్రి. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ పోషించింది కావ్య. బాల నటిగా గంగోత్రి సినిమాతో పాటుగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన విజయేంద్ర వర్మ చిత్రంలో , పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు చిత్రంలో , ప్రభాస్ హీరోగా నటించిన అడవి రాముడు చిత్రంలో అలాగే అందమైన మనసులో అనే చిత్రంలో కూడా నటించింది బేబీ కావ్య. కట్ చేస్తే ఆ బాల నటి ఇప్పుడు హీరోయిన్ గా టర్న్ అవుతోంది.

నేను అచ్చ తెలుగు అమ్మాయిని కాబట్టి నాకు అది మరింత ఎడ్వాంటేజ్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది కావ్య. గ్లామర్ పాత్రలతో పాటుగా పెర్ఫార్మన్స్ కు అవకాశం ఉన్న పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉన్నానని , ఇప్పటికే పలు అవకాశాలు వచ్చాయి కానీ మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని ….. అలాగే కొన్ని సినిమాలు త్వరలోనే ఒకే చేయనున్నామని ప్రస్తుతం కారోనా వల్ల షూటింగ్ లు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటోంది కావ్య. బాల నటిగా సత్తా చాటిన కావ్య హీరోయిన్ గా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని ఆశిస్తోంది టాలీవుడ్ మూవీ న్యూస్ .

మునుపటి వ్యాసంబిగ్ బాస్ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసాడో తెలుసా
తదుపరి ఆర్టికల్కావ్య ఫోటోలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి