ఆర్ ఆర్ ఆర్ నుండి ఆ హీరోయిన్ తప్పుకుందట

0
57
ala bhatt
ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంచలనాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన నటిస్తున్న ఈ భామ ఇప్పుడు నిజంగానే ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకుందట. గతకొన్నాళ్ళుగా అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకుందని ఊహాగానాలు చెలరేగాయి కానీ ఎప్పటికప్పుడు అవి నిరాధారమని తేలింది కట్ చేస్తే ఇప్పుడు మాత్రం నిజంగానే ఆర్ ఆర్ ఆర్ నుండి అలియా భట్ తప్పుకుందట .

ఇందుకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదు అనే ఒక కారణం మాత్రమే కాదు సుమా ! సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం కూడా మరో కారణం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అలియా భట్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల సడక్ 2 ట్రైలర్ విడుదల కాగా డిస్ లైక్స్ లో వరల్డ్ రికార్డ్ కొట్టేసింది అంటే అలియా పట్ల ఎంత కోపంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఆర్ ఆర్ ఆర్ కోసం పలుమార్లు అలియా భట్ డేట్స్ అడ్జెస్ట్ చేసిందట కానీ అనుకున్న రీతిలో ఆ డేట్స్ వాడుకోలేకపోయారు జక్కన్న అండ్ కో .

దాంతో ఇప్పుడు మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ కోసం డేట్స్ కేటాయించే పరిస్థితిలో లేనని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి చెప్పిందట అలియా ఇంకేముంది జక్కన్న కూడా ఒకే చెప్పి చరణ్ కోసం మరో భామని వెతికే పనిలో పడ్డారని వినిపిస్తోంది. ఇప్పటికే అలియా భట్ – చరణ్ లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు జక్కన్న. ఒకవేళ అలియా తప్పుకుంటే చరణ్ – అలియా ల మీద చిత్రీకరించిన అన్ని సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరించనున్నారు. 

మునుపటి వ్యాసంఆ స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రమే నటిస్తానంటున్న రోజా
తదుపరి ఆర్టికల్చంద్రబాబుని ఘోరంగా అవమానించిన మోహన్ బాబు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి