ఆ హీరో హీరోయిన్  ప్రేమలో ఉన్నారా ?

0
47
pranav kalyani

 

మలయాళ హీరో ప్రణవ్ మోహన్ లాల్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రేమలో ఉన్నట్లు కేరళలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రణవ్ మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు అన్న విషయం తెలిసిందే. ఇక కళ్యాణి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు. మలయాళ హీరోయిన్ లిజి – దర్శకుడు ప్రియదర్శన్ 90 వ దశకంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ముద్దుల కూతురే ఈ కళ్యాణి ప్రియదర్శన్. అయితే లిజి – ప్రియదర్శన్ లు పలు విభేదాలతో విడిపోయారు ….. విడాకులు తీసుకున్నారు.

దర్శకత్వ శాఖలో పనిచేసే కళ్యాణి ప్రియదర్శన్ ని హీరోయిన్ ని చేసింది దర్శకుడు విక్రమ్ కుమార్. అఖిల్ హీరోగా నటించిన హలో చిత్రంతో కళ్యాణిని హీరోయిన్ గా పరిచయం చేసాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ నటిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది దాంతో కేవలం తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ భాషల్లో కూడా నటిస్తోంది కళ్యాణి ప్రియదర్శన్.

ఇక ప్రణవ్ – కళ్యాణి ల విషయానికి వస్తే చిన్నప్పటి నుండి కూడా ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. మోహన్ లాల్ – ప్రియదర్శన్ లు ఇద్దరు కూడా స్నేహితులు కావడంతో ఒకరి ఇంటికి ఒకరు వచ్చి పోతుండేవాళ్లు దాంతో వాళ్ళ పిల్లలు అయిన ప్రణవ్ – కళ్యాణి లు కూడా స్నేహితులు అయ్యారు. చిన్నప్పటి నుండే కలిసి తిరిగేవాళ్లు. ఇటీవల సన్నిహితంగా కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఊహాగానాలు చెలరేగేలా ప్లాన్ చేసారు కొంతమంది ఆకతాయిలు. దాంతో ఈ విషయం మోహన్ లాల్ చెవిన పడటంతో ఆ వార్తలను ఖండించాడు. ప్రణవ్ – కళ్యాణి ఇద్దరు కూడా మంచి స్నేహితులు మాత్రమే అంతకుమించి  అనుకుంటున్నాను అని స్పష్టం చేసాడు. ప్రణవ్ – కళ్యాణి లు కలిసి ఓ మలయాళ చిత్రంలో నటించారు. అంతేకాదు మరో చిత్రంలో కలిసి జంటగా నటిస్తున్నారు. కేరళలో పలు ప్రాంతాల్లో కలిసి తిరుగుతున్నారు దాంతో ఈ ఊహాగానాలు చెలరేగాయి.

మునుపటి వ్యాసంఎన్టీఆర్ సినిమాలో మళ్ళీ ఆ స్టార్ హీరో
తదుపరి ఆర్టికల్ ప్రభాస్ సినిమాలో నివేదా థామస్ ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి