కోర్టు చిక్కుల్లో హీరో విశాల్ సినిమా

0
49
vishal in court troubles

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నైహీరో విశాల్ నటించిన ” చక్ర ” సినిమా కోర్టు చిక్కుల్లో చిక్కుకుంది. ఇక విశాల్ కు కోర్టు నోటీసులు ఇప్పించింది ఎవరో కాదు విశాల్ తో ” యాక్షన్ ” అనే సినిమాని తీసిన నిర్మాణ సంస్థ. విశాల్ కు సదరు నిర్మాణ సంస్థకు ఎందుకు గొడవలు వచ్చాయో తెలుసా …….. బిజినెస్ దగ్గరే. హీరో విశాల్ నటించిన యాక్షన్ సినిమాని 44 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది ట్రైడెంట్ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ. అయితే ఈ సినిమా బడ్జెట్ అనూహ్యంగా ఎక్కువ కావడంతో 20 కోట్లకు నాది హామీ. సినిమా హిట్ అయితే డబ్బులు మీకు వస్తాయి ఒకవేళ రాకపోతే 20 కోట్లకు బదులుగా నేను మీకు మరో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడట.

దాంతో విశాల్ ని నమ్మి యాక్షన్ అనే సినిమాని తీసి తమిళనాడుతో పాటుగా తెలుగులో కూడా విడుదల చేసారు. అయితే తెలుగులో రెండు రాష్ట్రాల్లో కలిపి 4 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. ఇక తమిళనాడులో 8 కోట్ల పైచిలుకు మాత్రమే వసూల్ అయ్యింది దాంతో భారీ నష్టం వచ్చింది కాబట్టి విశాల్ ఒప్పుకునట్లుగా మిగతా 8 కోట్ల 29 లక్షలకు మాకు హామీగా సినిమా చేయాల్సి ఉండే కానీ సినిమా చేయలేదు అలాగే డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు అందుకే అతడు నటించిన చక్ర సినిమా విడుదల కాకుండా ఆపేయాలంటూ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ.

పూర్వాపరాలను పరీశీలించిన కోర్టు చక్ర సినిమా విడుదల కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో విశాల్ సినిమా చిక్కుల్లో పడింది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ చక్ర చిత్రం రూపొందింది. ఆమధ్య విడుదలైన టీజర్ , ట్రైలర్ కు చాలా మంచి పేరు వచ్చింది. కరోనా కాస్త ఉపశమనం కలిగిస్తుండటంతో దీపావళికి చక్ర సినిమాని విడుదల చేయాలనీ చూస్తున్నాడు విశాల్. ఈ సినిమా విశాల్ సొంత సినిమా కావడంతో మా సంగతి తేల్చాకే ఈ సినిమా విడుదల చేయాలని అప్పటి వరకు నిలుపుదల చేయాలనీ అంటోంది ట్రైడెంట్ సంస్థ. మరి విశాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

మునుపటి వ్యాసంఅనవసరంగా మీడియా ప్రచారం- ఖండించిన నమ్రత
తదుపరి ఆర్టికల్మహేష్ దూకుడుకు 9 ఏళ్ళు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి