అభిమానిని పెళ్లి చేసుకున్న హీరో విజయ్

0
57
vijay tamil star

అభిమానిని పెళ్లి చేసుకున్న హీరో విజయ్

తనని బాగా అభిమానించి , ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తమిళ ఇళయదళపతి విజయ్. ఈ పెళ్లి ఇప్పుడు కాదు సుమా …… 21సంవత్సరాల క్రితం జరిగింది. తమిళనాట విజయ్ కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ హీరో విజయ్ మాత్రమే. అందుకే విజయ్ ని ఇళయ దళపతి గా అభివర్ణిస్తారు అభిమానులు. విజయ్ కి మాస్ ప్రేక్షకుల ఆదరణ మాత్రమే కాకుండా అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది. అందుకు ఉదాహరణే విజయ్ భార్య సంగీత. తమిళ కుటుంబం అయినప్పటికీ సంగీత కుటుంబం లండన్ లో స్థిరపడింది.

విజయ్ అంటే పిచ్చి అభిమానం ఆమెకు దాంతో విజయ్ ని ఎలాగైనా సరే చూడాలని 1996 లో లండన్ నుండి ఇండియాకు వచ్చింది. సాదాసీదాగా వెళితే హీరో కలవడు కాబట్టి తెలిసిన వాళ్ళ తో కలిసి విజయ్ ని కలిసింది సంగీత. తన కోసం లండన్ నుండి అందమైన అమ్మాయి రావడంతో హీరో విజయ్ నిజంగానే షాక్ అయ్యాడట. దాంతో ఆమెని ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. సంగీత ని చూసిన విజయ్ తల్లిదండ్రులు మన వాడికి తగిన అమ్మాయి అని భావించి ఈసారి వచ్చినప్పుడు మీ అమ్మా నాన్న లను కూడా తీసుకురామ్మా అని చెప్పారట.

దాంతో 1996 నుండి ప్రతీ ఏడాది విజయ్ కోసం సంగీత వస్తుండటంతో సంగీతని పెళ్లి చేసుకోమని చెప్పారట విజయ్ తల్లిదండ్రులు. తనకు నచ్చిన అమ్మాయి పైగా నేనంటే ప్రాణం కాబట్టి ఆలోచించడానికి ఏముంది అంటూ వెంటనే పెళ్లి చేసుకున్నాడు. విజయ్ – సంగీత ల పెళ్లి 1999 లో జరిగింది. ఈ ఇద్దరికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు జేసన్ సంజయ్ కాగా కూతురి పెరు దివ్యా ఈషా. విజయ్ తన అభిమానిని పెళ్లి చేసుకొని సరిగ్గా 21 సంవత్సరాలు పూర్తయ్యాయి. భార్య తన ఇంటి పనులు చక్కబెడుతుండటంతో విజయ్ హాయిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ హీరో మాస్టర్ అనే చిత్రంలో నటించాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

మునుపటి వ్యాసంప్రభాస్ నిర్ణయం వల్ల డైలమాలో పడిన అల్లు అరవింద్
తదుపరి ఆర్టికల్అర్జున్ రెడ్డి సంచలనానికి 3 ఏళ్ళు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి