కరోనాతో ఆసుపత్రిలో చేరిన హీరో విజయ్ కాంత్

0
36
tamilhero vijaykanth

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నై-కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తమిళ హీరో , రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ కు ఇటీవల కరోనా సోకింది దాంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్న కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో శ్వాసకోశ తీవ్రత అధికం కావడంతో వెంటనే చెన్నై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస తీసుకొవడం కెప్టెన్ విజయ్ కాంత్ కు ఇబ్బందికరంగా మారడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు డాక్టర్లు.

కాలేయం తో పాటుగా శ్వాస కోసం అవసరమైన చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. 68 సంవత్సరాల విజయ్ కాంత్ సినిమారంగంలో స్టార్ హీరోగా వెలుగొందాడు. 80 -90 వ దశకంలో తమిళనాట స్టార్ హీరోగా రాణించిన విజయ్ కాంత్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. విజయ్ కాంత్ నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై సంచలన విజయాలు అందుకున్నాయి. పోలీస్ అధికారి , కెప్టెన్ ప్రభాకర్ తదితర చిత్రాలు తెలుగులో ప్రభంజనం సృష్టించాయి.

అయితే సినిమాల్లో కెప్టెన్ గా రాణించిన విజయ్ కాంత్ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టాడు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు. కానీ రాజకీయంగా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు అందులోకోలేకపోయాడు. కాకపోతే శాసన సభ్యుడిగా మాత్రం ఎన్నికయ్యాడు. ఇక ఇప్పుడేమో ఓడిపోయి ఉన్నాడు. వచ్చే ఏడాది తమిళనాట ఎన్నికలు జరుగనున్నాయి దాంతో మళ్ళీ పోటీకి సిద్ధం అవుతున్నాడు విజయ్ కాంత్. కరోనా నుండి త్వరగా కోలుకొని మళ్ళీ రాజకీయాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు కెప్టెన్ అభిమానులు. 

మునుపటి వ్యాసంనన్ను కేసీఆర్ ట్రాప్ చేసాడు : డి. శ్రీనివాస్
తదుపరి ఆర్టికల్అత్తారింటికి దారేదికి 7 ఏళ్ళు పూర్తి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి