5 కోట్ల భారీ విరాళం అందించిన హీరో సూర్య

0
59
hero surya

తమిళ స్టార్ హీరో సూర్య 5 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. 5 నెలలుగా షూటింగ్ లు లేకపోవడంతో సినిమా రంగంలోని కార్మికులు అంతా ఖాళీగా ఉంటున్నారు. దాంతో అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఇంతకుముందే భారీ విరాళం అందించిన సూర్య తాజాగా మరోసారి స్పందించి 5 కోట్ల విరాళం అందించాడు. ఈ భారీ మొత్తం తమిళ సినిమా రంగంలో పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్ లోని సభ్యులకు కావాల్సిన విధంగా ఖర్చుపెట్టుకోమని చెప్పారు సూర్య. ముందుగా నిత్యావసర సరుకులు అందించాలని అలాగే మందుల కోసం ఖర్చు చేయాలని చెప్పారట.

సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ సెప్టెంబర్ లో థియేటర్ లకు అనుమతి లభించినా జనాలు థియేటర్ కు భయం లేకుండా వస్తారన్న నమ్మకం లేదు. అందుకే ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని సూర్య నటిస్తూ నిర్మించడం విశేషం. మరో విశేషం ఏంటంటే ……. ఆకాశమే నీ హద్దురా చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించడం విశేషం.

తమిళ హీరో సూర్యకు తెలుగులో ఇంతకుముందు మంచి మార్కెట్ ఉండేది. తెలుగులో మన స్టార్ హీరోలకు ఉన్నట్లుగానే మార్కెట్ ఉండేది ఒకప్పుడు. కానీ గతకొంత కాలంగా సూర్య నటించిన చిత్రాలన్నీ వరుసపెట్టి ప్లాప్ అవుతున్నాయి. దాంతో తెలుగు మార్కెట్ పడిపోయింది. మళ్లీ తెలుగులో తన మార్కెట్ ని నిలబెట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అవేవీ ఫలించడం లేదు పాపం.

మునుపటి వ్యాసంఆచార్య మోషన్ పోస్టర్ వచ్చేసింది
తదుపరి ఆర్టికల్పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన హీరోయిన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి