హీరో  కూతురు   ఐశ్వర్య కు కారోనా

0
54
TMN logo
TMN logo

హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కు కారోనా సోకింది దాంతో చెన్నై లోని ప్రముఖ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే  అర్జున్ మేనల్లుడు చిరంజీవి సార్జా చనిపోయాడు. అలాగే మరో మేనల్లుడు దృవ్ సార్జా కు అలాగే అతడి భార్యకు కారోనా సోకింది. అర్జున్ మేనల్లుళ్ళు కర్ణాటక లో ఉంటారు. వాళ్ళు కూడా సినిమారంగంలో రాణిస్తున్నారు హీరోలుగా. దృవ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

ఇప్పటికే ఈ విషయాల వల్ల అర్జున్ మనసు చలించిపోగా తాజాగా కూతురు కూడా కారోనా బారిన పడటంతో మరింతగా కలత చెందాడు అర్జున్. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది ఐశ్వర్య అర్జున్. ఇక ఇప్పుడేమో కారోనా బారిన పడటంతో అర్జున్ కుటుంబంలో ఆందోళన మొదలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి