విలన్ పాత్రలో హీరో

0
52
sharvanandh

మహా సముద్రం సినిమాలో హీరో శర్వానంద్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడట దాంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. టాలీవుడ్ లో మిగతా హీరోలకు భిన్నంగా తన కెరీర్ ని మలుచుకుంటున్నాడు శర్వానంద్. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్నాడు కూడా అయితే సడెన్ గా మహా సముద్రం అనే సినిమాలో నెగెటివ్ రోల్ పోషించడానికి అంగీకరించాడు. దాంతో శర్వానంద్ ఏంటి ? విలన్ గా నటించడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మహా సముద్రం సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా…….. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.

రెండేళ్ల క్రితం వచ్చిన ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి పలు చిత్రాలను చేయడానికి సన్నాహాలు చేసాడు. అయితే పలువురు హీరోలు ఒప్పుకున్నట్లే ఒప్పుకొని ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారు అజయ్ భూపతికి దాంతో ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. చివరకు శర్వానంద్ నెగెటివ్ రోల్ పోషించడానికి సిద్ధం కావడంతో కరోనా తగ్గుముఖం పట్టాక మహా సముద్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కు ఇది తప్పకుండా విభిన్న పాత్ర అనే చెప్పాలి. అయితే ప్రేక్షకులు శర్వానంద్ ని విలన్ గా ఒప్పుకుంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి