హీరో అజిత్ ఇంటికి బాంబ్ బెదిరింపు

0
80

తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టామని , అది ఏ క్షణంలోనైనా పేలుతుందని ఫోన్ కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు తమిళనాడు పోలీసులు. చెన్నై మహానగరంలోని అజిత్ ఇంట్లోనే కాకుండా అజిత్ ఇంటి చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అయితే అజిత్ ఇంట్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎలాంటి బాంబ్ జాడలు తెలియలేదు దాంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఎవరో ఆగంతకుడు చేసిన ఆకతాయి కాల్ గా తేల్చి పడేసారు. అయితే ఇంతకుముందు రజనీకాంత్, విజయ్ ఇళ్లల్లో కూడా బాంబ్ లు పెట్టామని ఇటీవల కాలంలోనే బెదిరింపు కాల్స్ వచ్చాయి దాంతో సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు.

అయితే రజనీకాంత్ ఇంట్లో బాంబ్ ఉందని ఫోన్ చేసింది ఓ పిల్లవాడు కాగా విజయ్ ఇంట్లో అలాగే అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు ఫోన్ చేసింది ఓ వికలాంగుడు అందునా కాస్త మతిస్థిమితం లేని వ్యక్తిగా తేల్చారు. ఇలాంటి కాల్స్ సర్వసాధారణం అయ్యాయి. దాంతో పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ సెలబ్రెటీల విషయంలో మాత్రం ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఫేక్ అయినా పర్లేదు కానీ ఒకవేళ నిజమే అని తేలితే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అప్రమత్తం అవుతున్నారు పోలీసులు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి