53 ఏళ్ల వయసులో డిగ్రీ ఎలిజిబుల్ టెస్ట్ రాసిన హేమ

0
33
artist hema

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ 53 ఏళ్ల వయసులో డిగ్రీ ఎలిజిబుల్ టెస్ట్ రాసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో అత్తగా , వదినగా , ఇతర క్యారెక్టర్ లలో నటించిన భామ ఈ హేమ. ఈ భామ వయసు 53 సంవత్సరాలు , అయితే ఈ వయసులో అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఎలిజిబుల్ టెస్ట్ రాసింది నిన్న. హైదరాబాద్ లో రాస్తే కొంత ఇబ్బంది కాబట్టి హైదరాబాద్ కు పక్కనే ఉన్న నల్గొండ జిల్లా కు అక్కడ రాసింది. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష నిన్న ఆదివారం రోజున జరిగింది. ఈ ప్రవేశ పరీక్షలో పాసైతే డిగ్రీ చేయొచ్చు.

తనకు డిగ్రీ పట్టా చేతిలో ఉండాలని ఆషగా ఉందట. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం వల్ల చదువు పూర్తి చేయలేదు అందుకే ఇన్నాళ్లకు ఆ పని చేయాలనీ డిసైడ్ అయ్యిందట. పైగా హేమ కు రాజకీయాలంటే ఆసక్తి . గతంలో సమైక్యాంధ్ర అనే రాజకీయ పార్టీ తరుపున పోటీ చేసింది అయితే చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రాజకీయాల్లో డిగ్రీ అనేది తప్పనిసరి ఎందుకంటే పదవులు ఒకవేళ లభిస్తే చేతిలో డిగ్రీ పట్టా ఉంది అని చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తోంది హేమ.

రాజకీయాల్లోకి వెళ్లినా వెళ్లకపోయినా డిగ్రీ పూర్తి చేశాను అనే సంతృప్తి అయినా ఉంటుందని భావిస్తోంది. ఇక నల్గొండ కు వచ్చి మరీ పరీక్ష రాయడం ఏంటి ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఇక్కడ మా బంధువర్గం అంతా ఉంది , అలాగే హైదరాబాద్ లో పరీక్ష రాస్తే ఇబ్బంది ఎదురు అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను అలాగే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ లో పాల్గొంటున్నాను అందువల్ల కూడా ఇది దగ్గర కాబట్టి అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది హేమ. మొత్తానికి 53 ఏళ్ల వయసులో కూడా చదువు మీద దృష్టి పెట్టిందంటే మంచి విషయమేగా. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి