ఆ నష్టాన్ని పూడ్చడానికి 15 సినిమాల్లో నటించాడట

0
42

డైలాగ్ కింగ్ సాయికుమార్ నటించిన ఈశ్వర్ అల్లా చిత్రంతో చాలా ఆర్ధిక ఇబ్బందులు పడ్డాడట. ఆ సినిమా కోసం చేసిన అప్పుని తీర్చడానికి ఏకంగా 15 సినిమాల్లో నటించాల్సి వచ్చిందని తన బాధని వ్యక్తం చేశారు సాయికుమార్. తన తమ్ముడు అయ్యప్ప పీ శర్మ దర్శకత్వంలో సాయికుమార్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమాకు 2 కోట్ల బడ్జెట్ అయ్యిందట. అప్పట్లో 2 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద సినిమా అనే చెప్పాలి. కానీ సాయికుమార్ కు అంతగా మార్కెట్ లేదు. దాంతో ఈశ్వర్ అల్లా చిత్రాన్ని విడుదల చేయడానికి బయ్యర్లు ముందుకు రాకపోవడంతో దాసరి నారాయణరావు మధ్యవర్తిత్వంతో సినిమా విడుదల అయ్యింది కానీ డిజాస్టర్ అయ్యింది.

ఒకటేమో ఆశించిన స్థాయిలో కథ , కథనం లేకపోవడం ఒకటైతే సాయికుమార్ తండ్రి పీజే శర్మ ఈ చిత్రంలో విలన్ గా నటించడం. పీజే శర్మ తెలుగులో వందలాది చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్ లు వేసాడు . అయితే తన స్టామినాకు తగ్గ క్యారెక్టర్ లు రాలేదని భావిస్తున్న తరుణంలో ఈశ్వర్ అల్లా చిత్రంలో మెయిన్ విలన్ గా పెట్టారు. ప్రేక్షకులు దాన్ని జీర్ణించుకోలేక పోయారు. దాంతో మొత్తం 2 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఆ 2 కోట్ల అప్పు తీర్చడానికి సాయికుమార్ 15 సినిమాల్లో నటించాడట. అప్పటి తన బాధని చెప్పుకుంటూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు సాయికుమార్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి