హమ్మయ్య కేసీఆర్ వచ్చిండు

0
57

హమ్మయ్య మొత్తానికి కేసీఆర్ వచ్చిండు. గత రెండు వారాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఎక్కడున్నాడు ? అంటూ ప్రతిపక్షాలు గోల చేసాయి. ఇక ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ కు కరోనా సోకింది అందుకే ప్రగతి భవన్ వదిలేసి ఫామ్ హౌజ్ కు వెళ్ళాడు అంటూ ప్రచారం చేసాయి. ప్రతిపక్షాలు , సోషల్ మీడియాలో కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్నా కేసీఆర్ కానీ ఇతరులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. సరైన సమాధానం ఇవ్వలేదు. దాంతో కేసీఆర్ కు కరోనా సోకిందన్న ప్రచారం నిజమే అనుకున్నారు. ఇలా అంతా గోల గోల అవుతుంటే 14 రోజుల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌజ్ నుండి రయ్ రయ్ మంటూ ప్రగతి భవన్ కు చేరుకున్నాడు తన కాన్వాయ్ తో. దాంతో అందరూ షాక్ అయ్యారు.

వచ్చి రావడమే వ్యవసాయ అధికారులను ప్రగతి భవన్ కు పిలిపించుకుని వ్యవసాయ శాఖ పై అలాగే రైతులకు రైతు బంధు ద్వారా అందరికి డబ్బులు జమ అయ్యాయా ? లేదా ? ఇంకా జమ కానీ రైతులను అందరినీ చూసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. మరోవైపు తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పనులు కోర్టు ఆదేశాలతో ఆగిపోయాయి కాబట్టి దాని మీద కూడా రివ్యూ చేయనున్నారట కేసీఆర్. రేపు కోర్టు ముందుకు సెక్రటేరియట్ కూల్చివేత అంశం రానుంది మరి.  

మునుపటి వ్యాసంఅమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్
తదుపరి ఆర్టికల్షర్మిల లవ్ స్టొరీ వెనుక కథ ఏంటో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి