ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త : ఫస్ట్ లుక్ వచ్చేసింది

0
23

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రభాస్ 20 వ చిత్ర విశేషాలను, పోస్టర్ లను చూడాలని ఆశపడిన అభిమానులకు శుభవార్త అందించాడు ప్రభాస్. ఈరోజు జులై 10న 10 గంటలకు తన కొత్త సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ని అలాగే టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ ముందుగా అనుకున్నట్లుగానే రాధే శ్యామ్ గా నిర్ణయించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే తో ప్రభాస్ రొమాంటిక్ ఫోజు ఇచ్చి ఫ్యాన్స్ ని అలరించాడు. తాజాగా విడుదల అయిన ఫస్ట్ లుక్ , టైటిల్ ప్రేక్షకులను అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ని అలరించే లా ఉంది.

ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళ , మలయాళ , హిందీ భాషలలో కూడా టైటిల్ ని ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన విషయం తెలిసిందే. దాంతో ప్రభాస్ నటించిన ప్రతీ సినిమా హిందీలో అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దాంతో పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ రాధే శ్యామ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే….. ఈ సినిమాకు ప్రభాస్ పెద్ద నాన్న ఒక నిర్మాత కావడం విశేషం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది లో విడుదల చేయనున్నారు.

మునుపటి వ్యాసంఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రానున్న ఎస్ ఎస్ రాజమౌళి
తదుపరి ఆర్టికల్గ్యాంగ్ స్టర్ వికాస్ దుబె ఎన్ కౌంటర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి