శుభవార్త: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్

0
156
about sp balu health

శుభవార్త: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్

గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఆరాధించి, అభిమానించే వాళ్లకు శుభవార్త ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్ అని తేలింది, అలాగే ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు దాంతో బాలు తనయుడు ఎస్పీ చరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీడియాకు బాలు యోగ క్షేమాల గురించి తెలిపాడు. మీ అందరి ప్రార్థనలు ఫలించి నాన్నగారు కొలుకుంటున్నారు. ఇక కరోనా టెస్ట్ లో నెగెటివ్ అని వచ్చింది అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు ఎస్పీ చరణ్. కరోనా బారిన పడిన బాలు త్వరగా కోలుకోవాలని కోరుతూ యావత్ చిత్ర పరిశ్రమ ప్రార్థనలు చేసిన విషయం తెలిసిందే.

కరోనా తీవ్రం కావడంతో శ్వాసకోశ ఇబ్బందులతో ఆగస్ట్ 5 న చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు బాలు. అయితే ఐసీయూలో చేరినప్పుడు బాగానే ఉన్నాను మళ్లీ కోలుకుని వస్తాను అని చెప్పిన బాలు పరిస్థితి రోజురోజుకీ దిగజారడంతో ప్రతీ రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాలు కండీషన్ క్రిటికల్ గానే ఉందని తెలిపారు. దాంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక పలువురు సినీ ప్రముఖులు బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధించారు. అందరి ప్రార్థనలు ఫలించినట్లున్నాయి. బాలు కరోనా నుండి కోలుకున్నారు అయితే ఇంకా ఐసియు లోనే చికిత్స పొందుతున్నాడు బాలు. కరోనా నుండి కోలుకున్నప్పటికి ఇంకా పూర్తిగా అయితే ఆరోగ్యం కుదుటపడలేదు. కాకపోతే కరోనా నెగెటివ్ అని తేలింది కాబట్టి త్వరగా కోలుకుని మళ్లీ పాటలు పాడి ఆబాల గోపాలంని అలరించాలని ఆశిస్తోంది టాలీవుడ్ మూవీ న్యూస్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి