జగన్ కు గట్టి గుణపాఠం: నిమ్మగడ్డకు లైన్ క్లియర్

0
53
cm jagan

ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి గుణపాఠం నేర్పింది సుప్రీంకోర్టు.ఎన్నికల కమిషనర్  గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించాలని జగన్ సర్కార్ కు మొట్టికాయలు వేసింది ఫలితంగా నిన్న అర్ధరాత్రి నిమాయక ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈ ఉత్తర్వులను గవర్నర్ ఆదేశానుసారం అన్నట్లుగా పేర్కొన్నారు. నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ సర్కార్ కు తీవ్ర అపనిందల పాలు అయ్యింది. ఎన్నో అవమానాలు జరిగినా జగన్ మాత్రం నిమ్మగడ్డ పునర్నియామకంకు ససేమిరా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినా , గవర్నర్ చెప్పినా వినకుండా సుప్రీంకోర్టు కు వెళ్ళాడు.

అక్కడ కూడా జగన్ కు మొట్టికాయలు పడటంతో చేసేదిలేక నిన్న రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగిందని, రాజ్యాంగం ఎంత గొప్పదో ఇలాంటి సంఘటనల వల్లే తెలుస్తుందని అంటున్నారు న్యాయ నిపుణులు. నిమ్మగడ్డ రమేష్ పునర్నియామక ఉత్తర్వులు వెలువడంతో నాలుగు నెలల పోరాటానికి , వివాదానికి ముగింపు పలికినట్లు అయ్యింది. కరోనా విలయతాండవం చేయబోతోంది అంటూ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అది జగన్ కు నచ్చలేదు, ఎక్కడో నశాలనికి ఎక్కింది అంతే నిమ్మగడ్డని తొలగించాలని పట్టుబడ్డాడు. నిమ్మగడ్డ న్యాయపోరాటం చేయడంతో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీతో పాటుగా మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ తమ విజయంగా భావిస్తున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి