గంటా శ్రీనివాసరావు అరెస్ట్ తప్పదా ?

0
52

ఇప్పటికే అచ్చెన్నాయుడు , కొల్లు రవీంద్ర లు అరెస్ట్ అయ్యారు, రేపో మాపో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అరెస్ట్ అవ్వడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుండి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభకు ఎన్నికై మంత్రి పదవి కూడా కొట్టేసాడు అవంతి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు కు అవంతి శ్రీనివాస్ కు అంతగా పడలేదు కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు కూడా ప్రత్యర్ధులు గా మారారు. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండగా అవంతి శ్రీనివాస్ జగన్ పార్టీలో కొనసాగుతున్నాడు.

నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన అవంతి శ్రీనివాస్ అచ్చెన్నాయుడు , కొల్లు రవీంద్ర లాగే గంటా శ్రీనివాసరావు కూడా అరెస్ట్ అవ్వడం ఖాయమని ఎందుకంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారని , గంటా అనుచరులతో పాటుగా గంటా కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారని వాళ్లంతా గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లోనే ఈ కబ్జాకు పాల్పడ్డారు కాబట్టి గంటా కు కూడా చిప్ప కూడు ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అవంతి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే గంటా శ్రీనివాసరావు జగన్ పార్టీలో చేరడానికి గట్టి ప్రయత్నాలు చేసాడు కానీ అవి వర్కౌట్ కాలేదు. గంటా అరెస్ట్ కు రంగం సిద్ధమైంది అని మంత్రి ప్రకటించడంతో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీని మరింతగా బలహీన పరచడానికి ఇలా అరెస్ట్ లతో భయపెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.  

మునుపటి వ్యాసంకరోనా అందరికీ వస్తుందంటున్న జగన్
తదుపరి ఆర్టికల్తెరపైకి దొడ్డి కొమురయ్య బయోపిక్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి