50 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి రెడీ అవుతున్న భామ

0
45
heroine
50 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి రెడీ అవుతున్న భామ

50 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి రెడీ అవుతోంది హాట్ భామ పూజా బేడీ. 90 వ దశకంలో బాలీవుడ్ లో తన హాట్ నెస్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ ఈ పూజా బేడీ. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా నటించింది. మోహన్ బాబు – దివ్యభారతి జంటగా నటించిన చిట్టెమ్మ మొగుడు చిత్రంలో పూజా బేడీ నటించింది. బొడ్డులో రూపాయి బిళ్ళ అంటూ మోహన్ బాబుతో ఆడిపాడింది కూడా. అయితే ఈ భామ ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలాని 1994 లో పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లల సంతానం కూడా కలిగింది ఈ భామకు. అయితే భార్యాభర్తల మధ్య తీవ్ర విబేధాలు రావడంతో 2003 లో విడాకులు తీసుకుంది.

ఇక అప్పటి నుండి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది పూజా బేడీ. గతకొంత కాలంగా మానేక్ కాంట్రాక్టర్ తో సహజీవనం చేస్తోంది పూజా బేడీ. ఇద్దరు కూడా ప్రేమలో ఉండటంతో మళ్ళీ పెళ్లి చేసుకోమని పూజా బేడీని అదేపనిగా పోరు పెడుతున్నారట తన ఇద్దరు పిల్లలు. మానేక్ కాంట్రాక్టర్ కు కూడా తన ఇద్దరు పిల్లలు అంటే ముద్దని , అలాగే తన పిల్లలకు కూడా మానేక్ ఇష్టమని త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఉందని అంటోంది పూజా బేడీ.

ప్రస్తుతం పూజ బేడీ వయసు 50 ఏళ్ళు దాటిపోయాయి ఇటీవలే. అంటే 51 లో అడుగుపెటిందన్న మాట. 51 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్ళికి సిద్ధం అవుతోంది అది కూడా పిల్లల ప్రోద్బలంతో. మొదటి భర్త ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ రెండో పెళ్లి చేసుకున్నాడు హాయిగా కాపురం చేసుకుంటున్నాడు నేను మాత్రం ఎన్నాళ్ళు సహజీవనం చేస్తాను …… నేను కూడా పెళ్ళికి రెడీ అని అంటోంది పూజా బేడీ.

మునుపటి వ్యాసంమరోసారి సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ
తదుపరి ఆర్టికల్మగాళ్లు ఆడవాళ్ళ కాళ్ళు పిసకాలాట హాట్ భామ సలహా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి