గంగవ్వకే మా ఓటు అంటూ ప్రచారం

0
66
bigboss 4 contestant

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్బిగ్ బాస్ 4 రియాలిటీ షోలో పాల్గొన్న గంగవ్వ ఎలిమినేషన్ లో ఉండటంతో ఆమెకు ఓటు వేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు గంగవ్వని అభిమానించే వాళ్ళు. వాట్సాప్ , ఫేస్ బుక్ లతో పాటుగా యూట్యూబ్ లలో కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు పలువురు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 4 ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 4 సీజన్ లో పలువురు పార్టిసిపేట్ చేస్తున్నారు అయినప్పటికీ గంగవ్వకు ఉన్నంత ఆదరణ మరెవరికీ లభించడం లేదు.

అసలు ఈ బిగ్ బాస్ 4 సీజన్ లో గంగవ్వ ని మించిన సెలబ్రిటీ లేదంటే నమ్మండి. బిగ్ బాస్ 4 అలరించేలా కాస్తైనా ఉందంటే అది కేవలం గంగవ్వ వల్లే ! ఎందుకంటే ఆమె మాట్లాడే భాష , యాస లతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక మిగతా పార్టిసిపెంట్స్ వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది ఇప్పటివరకు. యూట్యూబ్ స్టార్ లు , సినిమా వాళ్ళు అంటూ కొంతమంది వచ్చారు , ఉన్నారు కానీ వాళ్ళు ఎవరూ ఇవ్వని ఎంటర్ టైన్ మెంట్ కేవలం గంగవ్వ మాత్రమే ఇస్తోంది.

అయితే గంగవ్వ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉంది కాబట్టి ఆమెని బిగ్ బాస్ 4 హౌజ్ నుండి బయట పడేలా చేస్తే బిగ్ బాస్ 4 అలరించడం కష్టం అని భావిస్తున్నారు అందుకే గంగవ్వ కు ఓటు వేయండి ఎలిమినేషన్ నుండి తప్పించండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్లందరినీ ఓటు వేయండి అంటూ గ్రూప్ లు క్రియేట్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చూస్తుంటే బిగ్ బాస్ విన్నర్ గా గంగవ్వ నిలిచినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి