బిగ్ బాస్ 4 లో ట్రెండ్ సెట్టర్ గంగవ్వ

0
76
big boss contesentent trensetter gangavva

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఓ మారుమూల గ్రామంలో బీడీలు చేసుకుంటూ , పొలం పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీసే గంగవ్వ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తెలంగాణ యాసలో మాట్లాడే గంగవ్వ భాష ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుండటంతో ఆమె యూట్యూబ్ లో స్టార్ అయిపొయింది. కట్ చేస్తే ఆ యూట్యూబ్ ద్వారానే బిగ్ బాస్ 4 రియాలిటీ షోలోకి అడుగుపెట్టింది. నిన్న బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోలో పలువురు పాల్గొంటున్నప్పటికీ పెద్దగా కిక్ ఇచ్చేలా కనిపించడం లేదు వాళ్లలో ఒకే ఒక్కరు అదే ……. మన గంగవ్వ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో సింగర్ నోయెల్ , దర్శకుడు సూర్య కిరణ్ , అమ్మ రాజశేఖర్ , హీరోయిన్ మోనాల్ గజ్జర్ , లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ , యాంకర్ లాస్య , హెచ్ ఎం టీవీలో యాంకర్ గా చేసే జోర్దార్ సుజాత , దేత్తడి హారిక , మెహబూబ్ , టీవీ 9 దేవి , అరియనా గ్లోరీ , ఇస్మార్ట్ సోహెల్ , కరాటే కళ్యాణి , దివి , అఖిల్ సార్థక్ , వీళ్ళతో పాటుగా  గంగవ్వ కూడా ఈ షోలో పాల్గొంటోంది.

అయితే మిగతా వాళ్ళు కూడా ఎంతోకొంత ఫేమస్ అయినప్పటికీ అందరికంటే ఎక్కువగా గంగవ్వ ఫేమస్ అయ్యింది తన డైలాగ్ డెలివరీతో . డిఫరెంట్ మ్యాడ్యులేషన్ కావడంతో గంగవ్వ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు ఈ నాలుగో సీజన్ కు కూడా. అయితే బిగ్ బాస్ 4 సీజన్ కు ఐపీఎల్ కాస్త గండికొట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఐపీఎల్ కూడా షెడ్యూల్ విడుదల చేసింది. అసలే కరోనా వల్ల ప్రపంచం అంతా బిగుసుకుపోయింది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ అలాగే ఐపీఎల్ మంచి వినోదాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఐపీఎల్ వల్ల బిగ్ బాస్ కు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి