గ్యాంగ్ స్టర్ వికాస్ దుబె ఎన్ కౌంటర్

0
47

కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబె ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వికాస్ దుబె 8 మంది పోలీసులను అత్యంత దారుణంగా హత్య చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒక డిఎస్పీ సహా 8 మంది పోలీసులను హత్య చేయడంతో సవాల్ గా భావించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు వారం రోజుల్లోనే వికాస్ దుబె ని అరెస్ట్ చేయడం , కాన్పూర్ కు తరలిస్తున్న క్రమంలో పోలీసు వ్యాన్ ఒకటి పల్టీ కొట్టడం అదే అదనుగా వికాస్ పారిపోయే ప్రయత్నం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో కాల్చి చంపాల్సి వచ్చిందని అంటున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు మధ్యప్రదేశ్ వెళ్ళాడు వికాస్ దుబె. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుండి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరం ఉంది. పోలీసులను హత్య చేసి అంతదూరం ఎలా వెళ్లగలిగాడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. ఉజ్జయినిలో నిన్న గురువారం రోజున అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు తెల్లవారు జామున కాన్పూర్ కు తరలిస్తున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. దాంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ సంఘటన. ఉత్తరప్రదేశ్ లో గత కొంతకాలంగా ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్  గ్యాంగ్ స్టర్ లను ఎన్ కౌంటర్ చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 500 మంది గ్యాంగ్ స్టర్ లు ఎన్ కౌంటర్ చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.

మునుపటి వ్యాసంప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త : ఫస్ట్ లుక్ వచ్చేసింది
తదుపరి ఆర్టికల్టీఆర్పీ రేటింగ్ అదరగొట్టిన మహేష్ బాబు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి