రివ్యూ రైటర్లపై మండిపడిన గాయకుడు

0
26

47 డేస్ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదల అయ్యింది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కొంతమంది రివ్యూలు ఇచ్చారు. అయితే ఆ రివ్యూల వల్ల దర్శక నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే సినిమా విడుదల చేయడానికి థియేటర్లు లేవు. అసలే చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య ఉంది దానికి తోడు కరోనా పుణ్యమా అని థియేటర్లు అన్నీ మూతబడి 100 రోజులు దాటింది. ఇలాంటి సమయంలో ధైర్యం చేసి ఓటీటీలో విడుదల చేశారు 47 డేస్ చిత్రాన్ని. అయితే కొంతమంది రివ్యూల పేరిట తక్కువ రేటింగ్ ఇవ్వడంతో గాయకుడు , సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె తీవ్రంగా మండిపడ్డాడు.

నిర్మాత రూపాయి , రూపాయి కూడబెట్టి సినిమా చేస్తాడు. విడుదల చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లకు అండగా ఉండాల్సింది పోయి రివ్యూల పేరిట సినిమాని కిల్ చేయొద్దు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు రఘు కుంచె. కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు ఓపెన్ కావడం లేదు దాంతో పలు చిన్న చిత్రాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలకు రేటింగ్ ఇస్తూ నిర్మాతలను మరింత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రఘు కుంచె. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి