సుశాంత్ అకౌంట్ నుండి కోట్లు మాయం కొత్త విషయాలు వెలుగులోకి

0
44

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించే ముందు అతడి అకౌంట్ నుండి ఏకంగా 15 కోట్లు దారి మళ్లాయట. ఆ సొమ్ము ఎవరికి చేరింది? దాని వెనకాల ఉన్న రియా చక్రవర్తి సంగతి తేల్చండి అంటూ కృష్ణ కుమార్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు.  సుశాంత్ తండ్రి ఈ కృష కుమార్ సింగ్. బీహార్ రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబం కృష కుమార్ సింగ్ ది. కొడుకు సినిమాల మీద ఆసక్తితో ఎంతో కష్టపడి హీరో అయ్యాడు. అయితే స్టార్ డం అందుకున్న సమయంలో అర్దాంతరంగా ఆత్మహత్య చేసుకున్నాడు దాంతో సుశాంత్ కుటుంబం విషాదంలో మునిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ అకౌంట్ నుండి 15 కోట్లు దారి మల్లాయి అని పాట్నా ఐజీ సంజయ్ సింగ్ అంటున్నారు.

పాట్నా లోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు రియా చక్రవర్తి పై కేసు పెట్టాడు సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ . 15 కోట్లు సుశాంత్ అకౌంట్ నుండి ట్రాన్స్ ఫర్ అయ్యాయని , అవి ఎందుకు వెళ్లాయి అందుకు కారణం తప్పకుండా రియా చక్రవర్తి కి తెలిసే ఉంటుందని , అసలు ఇంత తతంగం జరగడానికి కారణం రియా చక్రవర్తి అని ఆమె మీద మాకు అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీదే అంటూ పోలీసులను ఆశ్రయించారు. సుశాంత్ అకౌంట్ లావాదేవీలను పరిశీలించిన ఐజీ కి అనుమానాలు మరింతగా బలపడ్డాయట రియా మీద అందుకే విచారణకు రావాలని ఆదేశించారు. సుశాంత్ చనిపోయే ముందు వరకు రియా సుశాంత్ ప్రేమలో ఉన్నాడు. అతడు చనిపోయే ముందు బ్రేకప్ చెప్పుకోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి