కరోనాతోమరణించిన మాజీ ఎం ఎల్ ఏ

0
80
RAJAIAH

భద్రాచలం మాజీ ఎం ఎల్ ఏ సున్నం రాజయ్య (59) కరోనాతో మరణించారు. ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది. నిత్యం ప్రజల్లో ఉండే సున్నం రాజయ్య కు కరోనా సోకడంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న వ్యాధి మరింతగా ముదిరి శ్వాస అందకుండా పోవడంతో వెంటనే విజయవాడకు తరలించారు. అయితే లాభం లేకపోయింది. కరోనాతో పోరాడి 59 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. దాంతో సున్నం రాజయ్య కుటుంబం మాత్రమే కాదు ఉభయ కమ్యూనిస్టులు కూడా తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు.

కమ్యూనిస్టు నాయకుడిగా , నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలిచారు. భద్రాచలం శాసన సభ్యుడిగా సేవలందించిన సున్నం రాజయ్య ఒడిపోయినప్పటికి నిత్యం ప్రజాల్లోనే ఉండేవాడు. ఇప్పుడు కరోనా సమయంలో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా పోరాటం చేశారు. కానీ కరోనా ముందు ఓడిపోయాడు. సున్నం రాజయ్య అంత్యక్రియలు ఈరోజు జరుగనున్నాయి. ఉభయ కమ్యూనిస్టులు పలు సమస్యలపై పోరాటం చేస్తున్నప్పటికీ అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉభయ కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది.

మునుపటి వ్యాసం‘మోస‌గాళ్లు’లో తోబుట్టువులుగా విష్ణు, కాజ‌ల్ ‌!
తదుపరి ఆర్టికల్ఖైదీ సీక్వెల్ వేగవంతం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి