మాజీ హోం మంత్రి నాయిని ఆరోగ్యం విషమం

0
48
nayani narasimha redyy

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- తెలంగాణ మాజీ హోం మంత్రి , టీఆర్ఎస్ సీనియర్ నాయకుడైన నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం నాయిని నర్సింహారెడ్డికి కరోనా సోకింది దాంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరాడు నాయిని. అయితే వారం రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ నాయిని ఆరోగ్యం మెరుగు పడకపోగా మరింతగా విషమించడంతో ఐసియులోకి మార్చారు. ప్రస్తుతం ఐసియు లో చికిత్స పొందుతున్నాడు నాయిని నర్సింహారెడ్డి.

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి పలువురు ప్రముఖులు ఇప్పటికే మరణించిన సంగతి తెలిసిందే. కరోనా అత్యంత ప్రమాదకారి కాదని అని చెబుతున్నప్పటికీ పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి మరణిస్తూనే ఉన్నారు. దాంతో కరోనా ని అలక్ష్యం చేయోద్దన్న సందేశం వెల్లువెత్తుతోంది.

ఇక నాయిని నర్సింహారెడ్డి విషయానికి వస్తే …… తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేతగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక కొత్త రాష్ట్రంలో హోం శాఖా మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించాడు. అయితే 2018 లో జరిగిన ఎన్నికల్లో నాయిని నర్సింహారెడ్డి కి మళ్ళీ టికెట్ ఇవ్వలేదు అలాగే ఎం ఎల్ సి గా కూడా అవకాశం ఇవ్వలేదు కేసీఆర్. దాంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు నాయిని . కానీ ఆ తర్వాత తన కోపాన్ని తగ్గించుకున్నాడు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని నర్సింహారెడ్డి త్వరగా కోలుకోవాలని నాయిని అభిమానులు కోరుకుంటున్నారు.

మునుపటి వ్యాసంఆ సంచలన చిత్రానికి 31 సంవత్సరాలు
తదుపరి ఆర్టికల్దిశా పథాని హాట్ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి