కరోనాతో మరణించిన  AP మాజీ మంత్రి

0
81
EX MINISTER

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మరణించాడు. కరోనా తో గతకొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కొద్దిసేపటి క్రితం మరణించారు. కరోనా సోకిన తొలిరోజుల్లో భయపడాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఓ వీడియో కూడా విడుదల చేశారు మాణిక్యాలరావు. అయితే ఇంట్లో ఉండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తగ్గకపోవడంతో విజయవాడ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వెంటిలేటర్ పై ఉన్నాడు కానీ కరోనా మహమ్మారి ముందు తలవంచక తప్పలేదు.

భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెం నుండి పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం ప్రభుత్వం కు మద్దతుగా బీజేపీ నిలవడంతో రెండు మంత్రి పదవులు కూడా లభించాయి. అందులో మాణిక్యాలరావు చంద్రబాబు కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రి గా పనిచేశారు. అయితే తెలుగుదేశం – బీజేపీ పొత్తు విఫలం కావడంతో మాణిక్యాలరావు తాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ లో చురుకైన నాయకుడిగా ఉన్న మాణిక్యాలరావు అకాల మృతి కమలనాదులను తీవ్రంగా కలిచివేస్తోంది. మాణిక్యాలరావు మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

మునుపటి వ్యాసంఅల్లు అర్జున్ కొరటాల శివ సినిమా కన్ఫర్మ్
తదుపరి ఆర్టికల్ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిచటానికి సెలెక్ట్ ఆ యినా కార్తీ మూవీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి