అనుష్క కోసం ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్న అభిమానులు

0
41
anushka,prabhas

అనుష్క కోసం ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్న అభిమానులు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అభిమానులు తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో ఈ రిక్వెస్ట్ చేస్తున్నారో తెలుసా…… అనుష్క విషయంలో. తాజాగా ప్రభాస్ ఆది పురుష్ అనే భారీ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. దాంతో శ్రీరాముడు పక్కన సీత పాత్రలో అనుష్క అయితే బాగుంటుందని అందుకే సీత పాత్ర కోసం అనుష్కని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇంతకుముందు అనుష్క – ప్రభాస్ లు బిల్లా , మిర్చి , బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో నటించారు. ఈ నాలుగు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి సంచలన విజయాలు సాధించాయి.

పైగా ప్రభాస్ – అనుష్క లది హిట్ పెయిర్ మాత్రమే కాకుండా చూడచక్కని జంట కూడా దాంతో మరోసారి ఈ జంటని చూడాలని ప్రేక్షకులు అందునా ప్రభాస్ , అనుష్క అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆది పురుష్ చిత్రంలో సీతగా అనుష్కని తీసుకోవాలని ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజంగానే ప్రభాస్ – అనుష్క జంట ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం. అయితే అభిమానుల కోరిక ప్రభాస్ తీరుస్తాడా అన్నది చూడాలి. ప్రభాస్ ఒకవేళ రికమెండ్ చేస్తే తప్పకుండా అనుష్క ని తీసుకుంటారు కానీ ఆ పని ప్రభాస్ చేస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అనుష్క – ప్రభాస్ లు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోవడం ఖాయమని రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి అలాగే అలాంటి వార్తలను వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు. మేము ఇద్దరం మంచి స్నేహితులం అంటూ స్టేట్ మెంట్ ఇస్తున్నారు కానీ ఆ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇక అనుష్క తాజాగా పాన్ ఇండియా చిత్రమైన నిశ్శబ్దం చిత్రంలో నటించింది. ఆ సినిమా త్వరలోనే ఓటీటీ లో విడుదల కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓటీటీ లో విడుదల అవుతుందా ? లేదా ? అన్నది మరో వారం , పది రోజుల్లో తేలనుంది.

మునుపటి వ్యాసంమహేష్ బాబు కోసం క్యూలో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు
తదుపరి ఆర్టికల్200 దేశాల్లో విడుదల కానున్న సూర్య సినిమా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి