బాలీవుడ్ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

0
16
Fans are outraged at Bollywood heroes

బాలీవుడ్ లో ఖాన్ త్రయం గా చెప్పబడుతున్న సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ , అమీర్ ఖాన్ లపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబికుతోంది. ఇండియన్ సూపర్ స్టార్స్ గా వెలుగొందుతున్న ముగ్గురు ఖాన్ లు కూడా ఇప్పటివరకు కరోనా పై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. దేశ వ్యాప్తంగా పలువురు హీరోలు , హీరోయిన్ లు , ఇతర సాంకేతిక నిపుణులు , రాజకీయ నాయకులు , వ్యాపారవేత్తలు పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు.

కానీ ముగ్గురు హీరోలు మాత్రం ఇంతవరకు స్పందించలేదు , విరాళాలు అందించలేదు. దాంతో దేశ వ్యాప్తంగా ఉన్న ముగ్గరు హీరోల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇంతటి ఉప్పెన వస్తే భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇంకా స్పందించడం లేదు ఎందుకు ? అని మండిపడుతున్నారు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇప్పటికైనా కరోనా పావు పోరాటానికి ప్రభుత్వాలకు అండగా నిలవాలని కోరుతున్నారు అభిమానులు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి