హీరోయిన్ కిడ్నాప్ కి విఫలయత్నం: ముఠా అరెస్ట్

0
15
Failure to kidnap heroine: gang arrest

హీరోయిన్ పూర్ణ ని కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేయాలని భావించిన ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కేరళ పోలీసులు. మలయాళ భామ ఆయిన పూర్ణ అసలు పేరు  షమ్న కాసిం. ముస్లిం యువతి అయిన పూర్ణ సినిమాల కోసం తన పేరు మార్చుకుంది. తెలుగులో అలాగే తమిళ్ లో మాలయాలంలలో పలు చిత్రాల్లో నటించింది. అయితే పూర్ణ కు పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించిన నేపథ్యంలో పలు సంబంధాలు చూస్తున్నారు.

ఇదే క్రమంలో ఓ కిడ్నాప్ ముఠాకు పూర్ణ వివరాలు తెలిశాయి. ఆమెని పెళ్లి పేరుతో కలిసి కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాలని ప్లాన్ చేశారు 12 మంది సభ్యుల ముఠా. అయితే తనని చూడటానికి వచ్చిన వాళ్ళు అంత నమ్మశక్యంగా లేకపోవడంతో పూర్తి వివరాలు ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో పూర్ణ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత పూర్ణ ని కిడ్నాప్ చేయడానికి , డబ్బులు వసూలు చేయడానికి రకరకాల డ్రామాలు ఆడారు దాంతో కేరళ పోలీసులను ఆశ్రయించింది పూర్ణ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు, మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. భారీ ప్రమాదం నుండి పూర్ణ బయటపడటం ,కిడ్నాప్ కలకలం మలయాళ చిత్ర రంగాన్ని కుదిపేస్తోంది.  

 

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి