మాజీ ఉప ముఖ్యమంత్రికి సోకిన కరోనా

0
62
TMN logo
TMN logo


తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కి కరోనా సోకింది దాంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. కడియం శ్రీహరి తో పాటుగా ఆయన డ్రైవర్ కు , గన్ మెన్ లకు కూడా కరోనా నిర్దారణ కావడంతో వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. కడియం శ్రీహరి మాత్రం హన్మకొండ లోని ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడు. కేసీఆర్ కేబినేట్ లో ఉప ముఖ్యమంత్రి గా నాలుగున్నర సంవత్సరాలు పని చేసారు కడియం శ్రీహరి. ప్రస్తుతం ఎం ఎల్ సి గా కొనసాగుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు శాసనసభ్యులు కరోనా బారిన పడ్డారు. కొంతమంది చికిత్స పొంది కోలుకోగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగాడు కడియం శ్రీహరి. 1994 లో ఎన్టీఆర్ కేబినేట్ లో మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రెండు పర్యాయాలు కూడా కీలకమైన బాధ్యతలు నిర్వరించారు మంత్రిగా. చంద్రబాబు హయాంలోనే దాదాపు పదేళ్ల పాటు మంత్రిగా కొనసాగి వరంగల్ జిల్లాలో తనదైన ముద్ర వేశారు. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక తెలుగుదేశం పార్టీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ సభ్యుడిగా ఆరు నెలల పాటు పనిచేసిన అనంతరం అప్పటి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ని మంత్రివర్గం నుండి తొలగించి కడియం శ్రీహరి ని ఉప ముఖ్యమంత్రి గా నియమించారు కేసీఆర్. అయితే ఇప్పుడు మాత్రం కేవలం ఎం ఎల్ సి గానే ఉన్నారు కడియం.

మునుపటి వ్యాసంపవర్ స్టార్ ట్రైలర్ లీక్ : వర్మ షాక్ తిన్నాడు
తదుపరి ఆర్టికల్పవర్ స్టార్ ట్రైలర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి