మరో బోల్డ్ చిత్రంలో ఈషా రెబ్బా

0
33
esha rebha

తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బా ఇప్పటికే లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో బోల్డ్ క్యారెక్టర్ పోషిస్తోంది. తెలుగు వెర్షన్ త్వరలోనే వెబ్ సిరీస్ రూపంలో రానుంది కాగా తాజాగా మరో బోల్డ్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈషా రెబ్బా. అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈషా రెబ్బా. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఈషా రెబ్బా కు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే అనూహ్యంగా ప్లాప్ లు ఎదురు కావడంతో స్టార్ హీరోల సరసన ఛాన్స్ రాలేదు. ఒకవేళ వచ్చిన ఒకటి , రెండు చిత్రాలు కూడా ఈషా రెబ్బా కు అంతగా ఉపయోగపడలేదు.

దాంతో ఇలా అడల్ట్ షో చేయడానికి సిద్దపడింది. బాలీవుడ్ లో కియారా అద్వానీ పోషించిన లస్ట్ స్టోరీస్ లోని పాత్రని తెలుగులో ఈషా రెబ్బాఆ పోషిస్తోంది. అది ఇంకా స్ట్రీమింగ్ కి రాకముందే సంపత్ నంది దర్శకత్వంలో మరో బోల్డ్ క్యారెక్టర్ పోషించడానికి సిద్దపడింది. దాంతో టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతోంది ఈషా రెబ్బా వ్యవహారం. మంచి నటి అయినప్పటికీ బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరిస్తుండటంతో అలాంటి పాత్రలకు ఇక ఈషా రెబ్బా కేరాఫ్ అడ్రస్ కానుందేమో చూడాలి. 

మునుపటి వ్యాసంనిహారిక ఎంగేజ్ మెంట్ జరిగింది
తదుపరి ఆర్టికల్పొట్టి నిక్కర్ లో హీట్ పెంచుతున్న అమలా పాల్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి