ఆ హీరోకు లిప్ లాక్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిందట

0
61
bipasa basu

హాట్ భామ బిపాసా బసు ఓ హీరోకు లిప్ లాక్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిందట. పైగా ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించింది. అసలు ఏమాత్రం సిగ్గుపడకుండా అందాలను ఆరబోసే భామ బిపాసా అంతేకాదు ఎలాంటి శృంగార సన్నివేశాల్లో అయినా సరే మొహమాటం లేకుండా నటిస్తుంది బిపాసా. అలాంటి బిపాసా బసు హీరోకు లిప్ లాక్ ఇవ్వడానికి చాలా సిగ్గుపడిందట. ఇంతకీ బిపాసాని సిగ్గుపడేలా చేసిన హీరో ఎవరో తెలుసా …….. మాధవన్. అవును సౌత్ హీరో మాధవన్ కు లిప్ లాక్ ఇవ్వాలంటే ఇబ్బందిపడిందట.

ఇంతకీ మాధవన్ అంటే ఎందుకంత ఇబ్బంది పడిందో తెలుసా ……. మాధవన్ బిపాసా బసు ఇద్దరు కూడా మంచి స్నేహితులు దాంతో ఆ స్నేహం కొద్దీ లిప్ లాక్ సీన్లో నటించడానికి ముందు రోజు చాలా టెన్షన్ పడిందట అసలు ఒకదశలో గుండె ఆగినంత పని అయిందట. అయితే నటించేది సినిమాలో కాబట్టి కాస్త ధైర్యం చేసుకొని అన్ని రకాలుగా ప్రిపేర్ అయి నటించిందట. మొత్తానికి లిప్ లాక్ సీన్ కంప్లీట్ కాగానే హమ్మయ్య అనుకుందట. బిపాసా హడావుడి చూసి మాధవన్ తో పాటుగా ఆ చిత్ర యూనిట్ అబ్బో……  బిపాసా వేషాలు …….. అనుకుంటూ నోరెళ్ళ బెట్టారట. మాధవన్ – బిపాసా బసు జంటగా జోడీ బ్రేకర్స్ చిత్రంలో నటించారు.

అడల్ట్ చిత్రాల్లో నటించే బిపాసా బసు మాధవన్ తో మాత్రం అలాంటి ఇంటిమేట్ సీన్ లలో నటించడానికి సిగ్గుపడిందని తెలిసి ప్రేక్షకులు కూడా చాలా ఫీల్ అవ్వడం ఖాయం ఎందుకంటే సిగ్గూ ఎగ్గూ అంటే ఏంటో తెలియని భామ ఇలా వ్యాఖ్యానించడం సంచలనమే మరి. కొన్నాళ్ల క్రితం వరకు తన హాట్ ఇమేజ్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ పెళ్లి చేసుకొని అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది. 

మునుపటి వ్యాసంనటి మాధవీలతపై కేసు నమోదు
తదుపరి ఆర్టికల్పసుపు దంచిన నిహారిక : పెళ్లి పనులు షురూ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి