కేటీఆర్ కు సవాల్ గా మారనున్న ఎన్నికలు

0
54
ktr telangana minister

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కు ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు , పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి ఇంకా కేటీఆర్ కు సవాల్ గా మారే ఎన్నికలు ఏంటి ? అని అనుకుంటున్నారా ? తెలంగాణలో ఇప్పుడు రెండు ఎం ఎల్ సి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పట్టభద్రుల స్థానాలలో రెండు చోట్లా గెలవాలని టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక పట్టభద్రుల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకొని అధికార టీఆర్ ఎస్ పార్టీకి గట్టి బుద్ది చెప్పాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇవి కాకుండా త్వరలోనే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇవే కాకుండా 2021 ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగనున్నాయి , ఆ తర్వాత మార్చిలో వరంగల్ , ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అంటే మొత్తంగా ఆరు నెలల కాలంలో కేటీఆర్ కు అగ్నిపరీక్ష అన్నమాట.

రెండు ఎం ఎల్ సి పట్టభద్రుల ఎన్నికలు , గ్రేటర్ హైదరాబాద్ , వరంగల్ , ఖమ్మం , దుబ్బాక అసెంబ్లీ సస్థానంలలో జరిగే ఎన్నికలు మిగతా పార్టీలకంటే కేటీఆర్ కు మాత్రమే ఎక్కువగా ప్రతిష్ట. ఎందుకంటే దుబ్బాక అసెంబ్లీ , గ్రేటర్ హైదరాబాద్ , వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ లలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీనే ! వాటిని మళ్ళీ నిలబెట్టుకోవాలి అంటే కేటీఆర్ కు అగ్నిపరీక్షే. అలాగే ఉన్న రెండు ఎం ఎల్ సి స్థానాల్లో ఒకటి బీజేపీ గెలుపొందింది మళ్ళీ బీజేపీ గెలుస్తుందా ? లేదా ? పక్కన పెడితే మరో స్థానంలో టీఆర్ఎస్ ఉంది ఆ స్థానం కూడా టీఆర్ఎస్ నిలబెట్టుకోవాలి. అంటే మొత్తంగా రాబోయే ఆరునెలల కాలంలో జరిగే ఎన్నికలు కేటీఆర్ కు సవాల్ గా మారనున్నాయి. మరి ఈ సవాల్ ని కేటీఆర్ అధిగమిస్తాడా ? లేదా ? అన్నది చూడాలి. 

మునుపటి వ్యాసంమహేష్ దూకుడుకు 9 ఏళ్ళు
తదుపరి ఆర్టికల్వికారాబాద్ అడవుల్లో రకుల్ షూటింగ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి