ఈ ముగ్గురిలో మహేష్ కు తగ్గ విలన్ ఎవరు

0
78

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పరశురాం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట గా ఈ చిత్రానికి నామకరణం చేశారు. బ్యాంక్ రాబరీ , అప్పులు తీసుకొని ఎలా ఎగ్గొట్ట వచ్చో , అలా ఎగ్గొట్టిన వాళ్ళ తాట తీసే పాత్రలో మహేశ్ బాబు నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకు తగ్గ విలన్ ల కోసం వెతుకుతున్నారు. తమిళ నటుడు అరవింద్ స్వామి, కన్నడ హీరోలు ఉపేంద్ర, సుదీప్ లను అనుకుంటున్నారట. అయితే ఈ ముగ్గురిలో ఎవరు అయితే బాగుంటుంది అన్న చర్చ కూడా సాగుతోందట. ఫస్ట్ ఛాన్స్ అయితే అరవింద్ స్వామి అని అంటున్నారు.

ఎందుకంటే చరణ్ హీరోగా నటించిన ధృవ చిత్రంలో హైలెట్ అరవింద్ స్వామి అనే చెప్పాలి. స్టైలిష్ విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరోలైన ఉపేంద్ర , సుదీప్ లు కూడా విలన్ గా అద్భుతమైన ప్రదర్శన చేయగలరు. ఈ ముగ్గురు కూడా నటనలో బెస్ట్ అనే చెప్పాలి. దాంతో ఈ ముగ్గురిలో అసలైన విలన్ ఎవరు ?మహేష్ కు తగ్గ విలన్ గా ఎవరు సెట్ అవుతారు అన్న మీమాంసలో ఉన్నాడట దర్శకుడు పరశురాం. మొత్తానికి ఈ ముగ్గురిలో ఒకరిని సెలెక్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

మునుపటి వ్యాసంవకీల్ సాబ్ టీజర్ రెడీ అవుతోంది
తదుపరి ఆర్టికల్వైరస్ గాండ్లపై నిప్పులు కక్కిన కొరటాల శివ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి