ఈ హీరో క్రేజ్ ఏంట్రా బాబూ! దిమ్మతిరిగేలా ఉందే

0
81

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. అతడి క్రేజ్ చూసి ఈ క్రేజ్ ఏంట్రా బాబూ మాములుగా లేదు దిమ్మతిరిగేలా ఉందని అంటున్నారు జనాలు. తాజాగా ఈ హీరో ఇన్ స్టా గ్రామ్ లో తన ఫాలోవర్స్ ని ఏకంగా 80 లక్షలకు పెంచుకున్నాడు. విజయ్ దేవరకొండ ని ఇంస్టాలో ఫాలో అయ్యేవాళ్ళు 8 మిలియన్స్ దాటారంటే అతడి క్రేజ్ ఏంటో కొత్తగా చెప్పాలా? యావత్ దక్షిణ భారతదేశంలోనే ఇంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో లేడు దాంతో ఇంస్టాగ్రామ్ వరకు తీసుకుంటే సౌత్ లో నెంబర్ 1 హీరో విజయ్ దేవరకొండ అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ లో చాలామంది స్టార్ హీరోలు ఉన్మారు కానీ ఇంస్టాలో మాత్రం 8 మిలియన్ ఫాలోవర్స్ మాత్రం లేరు. దాంతో ఆ అరుదైన రికార్డ్ ఈ హీరో సొంతం అయ్యింది.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో తన క్రేజ్ ని అమాంతం పెంచుకున్నాడు. తాజాగా ఈ హీరో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇంకా బాలీవుడ్ లో అడుగు పెట్టకుండానే బాలీవుడ్ భామలను లైన్లో వేస్తున్న ఈ దేవరకొండ ఫైటర్ చిత్రంలో అనన్య పాండే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇక ఈ ఫైటర్ చిత్రం తర్వాత మరింత మందిని , హీరోయిన్ లను తన అభిమానులుగా మలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మునుపటి వ్యాసంబ్రేకింగ్ న్యూస్: వరవరరావు కు కరోనా
తదుపరి ఆర్టికల్మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి గిఫ్ట్ రెడీ అవుతోంది
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి